2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో అవినీతి ఆరోపణల అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేసిన మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా ఇంటిపై సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఆకస్మిక దాడులు నిర్వహించింది. రాజాతో పాటు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వ్యక్తులు, రాజా సహచరులు, సోదరుడు పెరుమాళ్ ఇళ్లపై కూడా సిబిఐ దాడులు కొనసాగిస్తుంది.
డిల్లీ, చెన్నైలలో ఉన్న రాజా ఇళ్లపై బుధవారం ఉదయం 7.00 గంటల ప్రాంతంలో సిబిఐ దాడులు ప్రారంభించింది. రాజా వ్యక్తిగత కార్యదర్శి ఆర్‌కె ఛాందోలియా, మాజీ టెలికాం కార్యదర్శి బెహురియా, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్‌కె శ్రీనివాస్, ఏ శ్రీధర్ నివాసాలపై కూడా సిబిఐ దాడులు కొనసాగిస్తుంది.
కాగా.. నకిలీ మార్కుల షీటు కేసులో డాక్టర్ శ్రీధర్, ఆయన కుమారునికి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా తనను బెదిరించారని మద్రాసు హైకోర్టు జడ్జి ఆర్.రఘుపతి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిబిఐ దాడులు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకోనుంది. రాజా అక్రమ ఆస్తులకు సంబంధించిన వివరాలు సిబిఐ వెల్లడించాల్సి ఉంది.
(source-webnews)
The idea behind this blog is to educate/help/enlighten and not to create controversy or to incite. The opinions and views expressed on this blog are purely personal. Please be soft in your language, respect Copyrights and provide credits/links wherever possible.The blog team indemnifies itself of any legal issues that may arise out of any information/ views posted by anyone on the blog.
KIND ATTENTION - ALL BLOGGERS
DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.
No comments:
Post a Comment